ఊబకాయం, అధిక బరువు బాధితులు స్లిమ్ గా కనిపించేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంటారు. వీరిలో కొందరు ఆహారం తగ్గించుకోవటం, మరికొందరు వ్యాయామాల మీద దృష్టి పెడుతుంటారు. అలాగని ఈ రెంటితోనే క్యాలరీలు కరుగుతాయని అనుకోవాల్సి పనిలేదు. రోజువారీ జీవితంలో ప్రతిపనికీ యంత్రాల మీద ఆధారపడుకుండా ఎంతోకొంత ఇంటిపనిలో నిమగ్నమైనా క్యాలరీలు కరిగి అధిక బరువు సమస్య దారికొస్తుంది. ఆ వివరాలు....

ఇవీ లెక్కలు

  • మీ ఇంటి చుట్టూ మొక్కలున్నాయా? అక్కడ రోజూ ఒక అరగంట పాటు పాదులు తవ్వటం, మొక్కలు నాటటం వంటి ఏ పని చేసినా 100 క్యాలరీలు ఖర్చయినట్లే.
  • ఉదయం లేదా సాయంత్రం సమయంలో కనీసం 20 నిమిషాలు వాకింగ్ చేస్తే 103 క్యాలరీలు ఖర్చవుతాయి. అయితే దానికి ముందు కొద్దిగా నడక, జాగింగ్ చేయటం మరువొద్దు.
  • ఏ మధ్యాహ్నం సమయంలోనైనా ఇంట్లో హాయిగా కూర్చొని ఒక గంటపాటు ఏ కుట్లో, అల్లికలో వేసినా 100 క్యాలరీలు ఖర్చవుతాయి. అరగంటపాటు మీ పెంపుడు కుక్కను తీసుకొని అలా తిరిగొచ్చినా 100 కేలరీలు ఖర్చవుతాయి.
  • సెలవురోజు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ కు వెళ్లి, అందులో కార్ట్ తీసుకొని ఏమీ కొనకపోయినా ఓ ముప్పావు గంట అలా తిరగండి. అంటే.. విండో షాపింగ్ తో బాటు ఆరోగ్యమూ అన్నమాట.
  • రోజు మొత్తంలో గంటపాటు ఇల్లు శుభ్రం చేయటం, వంటపనిలో సాయం చేయటం, బట్టలు ఉతకటం వంటి పనులు చేస్తే 215 క్యాలరీలు ఖర్చవవుతాయి.
  • అదే.. అరగంటపాటు వేగంగా, ఉత్సాహంగా డాన్స్ చేస్తే 200-400 క్యాలరీలు ఖర్చవుతాయి.
  • మీ భాగస్వామికి ఓ 20 నిమిషాలు గట్టిగా మర్దన చేసినా 105 క్యాలరీలు ఖర్చవుతాయి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE