ముగ్గులు

సంక్రాంతి విశేషాల్లో మొదటిది ముగ్గు. ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితి శక్తికి,  చుక్కలు గతిశక్తికి ప్రీతీకలని పెద్దల విశ్వాసం. ఈ ముగ్గులు శ్రీ చక్ర ప్రతీకలని శక్తి ఆరాధకులు భావన. వివిధ ఆకారాల గ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలు కూ సంకేతాలుగా చెప్పచ్చు.ఇక.. పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

గొబ్బెమ్మలు

పండుగ వేళ ముగ్గుల మీద పెట్టే గొబ్బెమ్మలు  గోపికలకు సంకేతం. ముగ్గు మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలు తొ అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.

భోగిపళ్ళు

భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

తిల తర్పణం

సంక్రాంతి రోజు నల్లనువ్వులతో మరణించిన పెద్దలకు తర్పణములివ్వడం సంప్రదాయం. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటారు . ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.

 సంక్రాంతి పురుషుడు

ఏటా సంక్రాంతి పురుషుడు ఒక్కో వాహనాన్ని ఎక్కి వస్తాడని పెద్దల నమ్మకం. ఎక్కినా వాహనాన్ని బట్టి ఆ యేటి ఫలితాలుంటాయని విశ్వసిస్తారు. ఇందుకు ప్రతీకగా ఒక మట్టి బొమ్మ చేసి  సంక్రాంతి మూడు రోజులూ పూజలు చేస్తారు.

హరిదాసు

ముగ్గులు, గొబ్బిళ్ళ మధ్య నిలిచి హరి నామం చేస్తూ ఇంటింటికీ తిరిగే హరిదాసు ఈ పండుగకు గొప్ప ఆకర్షణ. ఆయనను సాక్షాత్తూ ఆ కృష్ణ పరమాత్మ రూపంగా భావిస్తారు. పండుగ చివరి రోజు ఆయనను తగిన రీతిలో సత్కరించటం ఆచారం.

సౌభాగ్యానిచ్చే ‘ముక్కనుమ’ నోము

సంక్రాంతి నాల్గో రోజును ముక్కనుమ. ఈ రోజున కొత్తగా పెళ్లి కావలసినవారు, పెళ్లయిన యువతులు  'బొమ్మల నోము' పడతారు. దీనినే సావిత్రీ గౌరీ వ్రతమని అంటారు. దీనివల్ల మంచి భర్త లభిస్తాడని, భర్త సుఖంగా ఉంటాడని చెబుతారు. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని ఉంచి  పూజిస్తారు. తర్వాత ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.

గాలిపటాలు

సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది గాలిపటాలు. అందుకే దీన్ని పతంగుల పండుగ అని అంటారు. పిల్లపెద్ద అనే తేడా లేకుండా అందరూ పతంగులు ఎగరేస్తారు. వారం రోజులపాటు గాలిపటాల సంబరాలు కొనసాగుతుంటాయి.  ఎగిరే గాలిపటాలను చూడటం వల్ల  కంటిచూపు మెరుగుపడుతుందని, తల బాగా పైకి ఎత్తి చూసేటప్పుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE