మూత్రం గాఢత పెరిగి అందులోని లవణాలు చిన్నచిన్న రాళ్లుగా ఏర్పడితే వాటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. ఇప్పుడు ఇది పిల్లల మొదలు పెద్దల్లో కనిపించే అనారోగ్య సమస్య. అయితే పలు ఆధునిక చికిత్సల సాయంతో వీటిని తొలగించవచ్చు. అలాగే కొన్ని సహజసిద్ధమైన రసాల ద్వారా ఈ స్టోన్స్ ను కరిగించవచ్చు. అలాంటి వాటిలో అరటిదూట రసం ఒకటి. అదెలా చేయాలో తెలుసుకొందాం. 

కావాల్సినవి  

అరటిదూట ముక్కలు   -  1 కప్పు (పీచుతీసి, చిన్న ముక్కలు చేసుకోవాలి)

పెరుగు                     -   పావుకప్పు

అల్లం                        - 1 అంగుళం ముక్క

కొత్తిమీర                      -   తగినంత 

చేసే విధానం

పైన సిద్ధం చేసుకొన్న అన్నీ కలిపి మిక్సీలోవేసి, వడగట్టి తాగాలి. ఈ రసం తాగితే శరీరానికి కావలసిన పీచు పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల మలబద్ధకం ఉంటే సుఖ విరేచనం అవుతుంది. కిడ్నీరాళ్ళు కూడా నెమ్మదిగా కరుగుతాయి.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE