కొందరికి మిగతా శ‌రీర ఆకృతి  అంతా బాగానే ఉన్నా పొట్ట మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకు కార‌ణం అక్క‌డ పేరుకుపోయే కొవ్వే. వయసుకు అతీతంగా కనిపించే ఈ సమస్యకు కారణాలు అనేకం. అలాగని పీడీనికోసం వైడెలా దగ్గరకు నేరుగా పరుగెత్తుకు పోవాల్సిన పనిలేదు. రోజువారీ వ్యాయామంతో బాటు ఈ కింద నిపుణులు సూచించిన ఆహారాల‌ను తీసుకుంటే ఎవ‌రైనా పొత్తికడుపు చుట్టూ అతిగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. ఆ ఆహారాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

  • నిమ్మరసం కొవ్వును కరిగిస్తుంది గనుక ఉదయం లేవగానే గ్లాసెడు గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి. ఇందులో కొద్దిగా తేనె కలుపుకొంటే రుచీ బాగుంటుంది.
  • పరగడుపునే గోరువెచ్చని నీటిలో చెంచాడు అల్లం రసం కలుపుకొని తాగితే పొత్తికడుపు చుట్టూ అతిగా చేరిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.
  • ఉదయం నిద్రలేవగానే నోరు పుక్కిలించి రెండు వెల్లుల్లి రెబ్బ‌ల్ని తింటే పొట్ట కిందిభాగంలో చేరిన కొవ్వు కరిగిపోతుంది.
  • రోజూ అల్పాహారానికి ముందు 4 చెంచాల పుదీనా ఆకుల రసం తాగితే పొట్ట కరగటమే గాక జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది .
  • ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు కలబంద (అలోవెరా) గుజ్జునుంచి తీసిన 30 మి.లీ రసం గ్లాస్ నీటిలో కలుపుకొని తాగితే కొవ్వు బెడదతో బాటు మలబద్దకం కూడా వదిలి బరువు తగ్గుతారు.
  • భోజనానికి ముందు కప్పు పుచ్చముక్కల్ని తింటే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తింటాము. అలాగే రోజూ గుప్పెడు ఉడికించిన చిక్కుళ్ళు తినటం వల్ల కొవ్వు తగ్గటమే గాక జీర్ణక్రియా మెరుగుపడుతుంది.
  • ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు గ్లాసు కీరదోసకాయ రసం తాగితే పొట్టచుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.
  • రోజూ పరగడుపునే గుప్పెడు టమోటా ముక్కలు తింటే వాటిలోని 9 ఆక్సో ఓడిఏ అనే రసాయనం కారణంగా రక్తంలోని కొవ్వు తగ్గుతుంది .Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE