• HOME
 • చిట్కాలు
 • వేసవిలో పిల్లలు, వృద్ధులు పాటించాల్సిన జాగ్రత్తలు

ఎండలు మండి  పోతున్నాయి. ఈ ఏడాది మరింతగా ఎండలు ఉంటాయని ముందునుంచే వాతావరణ శాఖ జనాన్ని అప్రమత్తం చేస్తోంది . గాలిలో తేమ, ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే రోజులివి. నవజాత శిశువుల మొదలు పరీక్షలు పూర్తయి ఆటలే లోకంగా గడిపే చిన్నారులు, పెద్దవయసు వారు ఈ రోజుల్లో ఎక్కువగా ఎండల బారిన పడుతుంటారు. అందుకే వీరి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.

పిల్లల కోసం

 • పిల్లలకు మెత్తని, పల్చని నూలు దుస్తులే వేయాలి. కిస్ మిస్, ఖర్జూరాలు నీటిలో నానబెట్ట్టి , వడపోసి రవ్వంత తేనె కలిపి పిల్లలకు పట్టిస్తే ఎండ ప్రభావం ఉండదు.
 • నవజాత శిశువుల నుంచి పదేళ్ళ లోపు పిల్లలను ఎండపొడ బారిన పడకుండా చూడాలి. సబ్బుకు బదులుగా సున్నిపిండితో మాత్రమే స్నానం చేయించాలి. స్నానానికి గోరువెచ్చని నీరు మాత్రమే  వాడాలి.
 • పౌడర్ వాడటానికి బదులు అప్పటికప్పుడు తీసిన గంధం వంటివి వాడితే ఒంటికి చల్లగా ఉంటుంది.
 • సెలవులు గడిపే పిల్లలను ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఇంటి పట్టునే ఉంది ఆడుకునేలా చూడాలి . చెస్ , క్యారమ్స్ వంటి ఆటలు ఆడేలా వారిని ప్రోత్సహించాలి.
 • రాత్రి పడుకోబోయే ముందు కాచిన పాలలో నాలుగో వంతు అన్నం, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు వేసి తోడూ పెట్టి ఉదయం పూట అల్పాహారంగా పిల్లలు పెట్టాలి.  దీని వల్ల తగినంత శక్తితో బాటు ఒంటికి చలువ చేస్తుంది.
 • సాయంత్రం పూట ఇంట్లో చేసిన పండ్ల రసాలు, మరమరాల  ముద్దలు,  నువ్వుల ఉండలు, బెల్లం, పల్లీలు వంటివి చిరు తిండిగా ఇవ్వాలి.

వృద్ధులకు

 • 60 దాటిన వారు ఉదయం పూట నడక, జాగింగ్ వంటివి పూర్తి చేసుకుని 8 గంటలకు ఇల్లు చేరాలి. మధుమేహులు వీలైనంత త్వరగా అల్పాహారం చేయాలి.
 • అల్పాహారం, భోజనానికి మధ్య బార్లీ నీరు, పల్చని మజ్జిగ, ఖర్జూరాలు కాచిన నీరు వంటివి తీసుకోవాలి.
 • సాయంత్రం పూట చెరుకు రసం తాగితే మంచిది . వీలయితే అందులో నిమ్మరసం , అల్లం రసం కలుపుకోవచ్చు.
 • ఏదైనా పనిమీద బయటికి వెళ్ళాల్సి వస్తే 5 గంటల తర్వాతే వెళ్ళాలి . అంతకు ముందే వెళ్ళాల్సి వస్తే గొడుగు, మంచి నీళ్ళు తీసుకొని టోపీ వంటి ఏర్పాట్లతో మాత్రమే కదలాలి.
 • ఎండలో తిరిగి సాయంత్రం ఇంటి వచ్చాక చల్లని నీటితో కాళ్ళూ చేతులూ కడుక్కొని నిమ్మరసం వంటివి తీసుకోవాలి .
 • ఎండకు తిరిగి వచ్చిన వారు తలస్నానం చేయటానికి బదులుగా సున్ని పిండితో మామూలు స్నానం చేయటమే మంచిది.
 • సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఇంటి దగ్గరలోని పార్కు, మైదానంలో పిల్లలూ, పెద్దలూ కలిసి సరదాగా తిరిగి వస్తే శరీరానికి వ్యాయామంతో బాటు మనసుకు ఉల్లాసంగానూ ఉంటుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE