అదృష్టాన్ని తెచ్చే మొక్కగా మనీప్లాంట్ కు పేరుంది. సానుకూల తరంగాలను ప్రసరింపజేసి ఇంట్లోని వారికి శక్తినీ, అదృష్టాన్ని ఇస్తుందనీ చెబుతారు. ఇంటిలోని గాలిని సైతం ఈ మొక్క శుభ్రపరుస్తుంది. తక్కువసమయంలో పెరిగే ఈ మొక్క వెలుతురు అంతగా లేని చోట కూడా పెరుగుతుంది. నున్నని ఆకుపచ్చని ఆకులు, సున్నితమైన తీగలతో వేగంగా పెరిగే ఈ మొక్కను ఎక్కడబడితే అక్కడ పెంచరాదనీ, నిర్దిష్ట ప్రదేశంలో పెట్టినప్పుడే అది శుభఫలితాలనిస్తోందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ నియమాలు

  • దీనిని వీలునుబట్టి కుండీ లేదా సీసాల్లోనూ పెంచుకోవచ్చు.అయితే రోజూ ఈ మొక్కకు ఎంతో కొంత నీరు పోయాలి.
  • మొక్కకున్న ఎండిన, పసుపు రంగు ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకుంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.
  • గణేశుని స్థానమైన ఇంటి ఆగ్నేయ మూలన ఈ మొక్కను ఉంచితే అన్నివిధాలా శుభాలు చేకూరతాయి.
  • ఈ మొక్కను ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఈశాన్య మూలన ఉంచరాదు. దీనివల్ల ధననష్టంతో బాటు ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు తప్పవు.
  • నియమం ప్రకారం ఈ మొక్కను పెంచితే ఆ ఇంట్లో ఉన్నవారి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇంటి లోపలి, బయటి పరిసరాల్లో సానుకూల శక్తి తరంగాలు వ్యాపిస్తాయి. 



Recent Stories







bpositivetelugu

పరిమళాల వాడకంలో మెళకువలు

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు.

MORE
bpositivetelugu

రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో

MORE