• HOME
  • వాస్తు
  • వాస్తు దోషాలను హరించే గణపతి మూర్తులు

  ఇటీవలి కాలంలో వాస్తు దోషాలకు గణపతిని ఆరాధించటం ఎక్కువగా కనిపిస్తోంది. వాస్తు దోషాలకు నివారణగా ఇల్లు, ఆఫీసు అలంకరణలోనూ గణపతి ప్రతిమలను వాడటం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఉన్న సమస్యను బట్టి ఎంపిక చేసుకోవాల్సిన గణపతి రూప విశేషాలను వారు సూచిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకొందాం.

  • ఇంటిలో.. నిల్చుని ఉన్న గణపతి ఉంటే ఆ ఇంటివారు సంతోషంగా జీవిస్తారు. అయితే.. నిల్చుని ఉన్న గణపతి దుకాణాలు, కార్యాలయాల్లో ఉంటే..వినియోగదారుల సంఖ్య తగ్గిపోతుంది. అందుకే .. ఇలాంటిచోట కూర్చొని ఉన్న గణపతి ప్రతిమనే పెట్టుకోవాలి.
  • తొండం ఎడమ వైపు తిరిగి ఉన్న గణపతి ప్రతిమను ఇంటి ముఖద్వారం పై ప్రతిష్టించడం వలన సకారాత్మ శక్తి తరంగాల ప్రసారం జరుగుతుంది. ఇలాంటి మూర్తిని ఇంటి మధ్యలో ప్రతిష్ఠిస్తే ఇంటి వాతావరణంలో సమతౌల్యం ఏర్పడుతుంది. ఈ ప్రతిమ పసుపు రంగుతో ఉండడం మరీ విశేషమైనదిగా భావిస్తారు.
  • ఉత్తర దిశ వైపు ఉంచే గణపతి ఆకుపచ్చ రంగులో ఉండడం మంచిది, అలాగే దక్షిణ దిక్కులో ఉండే గణపతి పగడం లేదా ఎరుపు రంగు లోఉండడం, తూర్పు దిశ లో ఉండే గణపతి స్పటికం లేదా చలువరాతి తో ఉండడం, పశ్చిమం లో నీలం రంగులో ఉండే గణపతి మూర్తులను ఉంచడం మంచిది.
  • ఏకదంత గణపతిని ప్రతిష్ఠిస్తే నకారాత్మక శక్తి నశించి ధన వృద్ది కలగడమే గాక కుటుంబం లో సమస్యలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి, మంచి ఆలోచనలు , బుద్ది వికాసం ఏర్పడతాయి.
  • మహోదర గణపతిని ఇంటి మధ్య భాగం లో ప్రతిష్టించడం వలన నకారాత్మక శక్తి ని తొలగిపోతుంది. దృష్టి దోషం తొలగి విఘ్నాలు నివారింపబడతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
  • పెద్ద చెవులున్న గణపతిని ప్రతిష్టించడం వలన ఆధ్యాత్మిక శక్తి వృద్ది చెంది , కుటుంబ సభ్యుల మధ్య స్నేహభావం, ప్రేమానురాగాలు ఏర్పడతాయి. యంత్ర, మంత్ర సాధనలలో ఈ స్వరూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
  • పెద్ద పొట్ట గల గణపతి మూర్తి స్థాపన వలన మనుషుల మనసు స్వచ్చంగా ఉంటుంది. వారి కోపం దూరమవుతుంది.
  • వికట గణపతిని భవన నిర్మాణ సమయంలో వాడటం తెలిసిందే. దృష్టి దోషాల నివారణ, అనుకోని అవాంతరాలను అధిగమించేందుకు ఈ మూర్తి దోహదపడుతుంది.
  • చేతిలో కమలం ఉన్న విఘ్న గణపతిని ప్రతిష్టించడం వలన విఘ్నాలు తొలగిపోవటమే గాక సానుకూల శక్తి ఇంట్లో ఉత్పన్నమవుతుంది. ఆపదలూ తొలగి పోతాయి.
  • నల్లని ధూమ్రవర్ణ గణపతి మూర్తి రాహుగ్రహ ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుంది.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE